ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

హడలెత్తిస్తున్న గజరాజులు - Elephants that terrorize farmers at vijayanagaram

విజయనగరం జిల్లా కురుపాం నియోజకవర్గంలో గజరాజులు హల్​చల్ చేస్తున్నాయి. వాటిని కట్టడి చేసేందుకు అటవీ అధికారులు చర్యలు చేపడుతున్నారు.

Elephants that terrorize farmers at vijayanagaram district
హడలెత్తిస్తున్న గజరాజులు

By

Published : May 24, 2020, 1:38 AM IST


విజయనగరం జిల్లా గరుగుబిల్లి మండలం గిజబ గ్రామంలో వారంరోజుల నుంచి గజరాజులు తిష్టవేశాయి. పంట పొలాల్లో, సమీపంలో ఉన్న నాగావళి నది ఒడ్డున తిరుగుతూ రైతులను భయపెడుతున్నాయి. సమీపంలోని రైతుల పంటపొలాల్లో తిరుగుతూ... అందరినీ ఆందోళనకు గురిచేస్తున్నాయి. అప్రమత్తమైన అటవీ అధికారులు, రెవెన్యూ, పోలీస్ సిబ్బంది చర్యలు తీసుకుంటున్నారు. చుట్టుపక్కల గ్రామాల్లో దండోరా వేయించారు. పొలం పనులకు ఎవరూ వెళ్లవద్దని రైతులను అధికారులు హెచ్చరించారు.

ఇదీ చూడండి:చేనేత బతుకులపై లాక్‌డౌన్ పిడుగు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details