విజయనగరం జిల్లా కోమరడా మండలం అర్తం గ్రామంలో.. గజరాజులు తిష్టవేశాయి. పంట పొలాల్లో తిరుగుతూ రైతులను భయపెడుతున్నాయి. సమీపంలోని రైలు పట్టాలు దాటుతూ.. అందరినీ ఆందోళనకు గురిచేస్తున్నాయి. జియ్యమ్మవలస, గరుగుబిల్లి మండలాల్లో సంచరిస్తూ... తోటపల్లి ప్రాజెక్టు గుండా కోమరడా మండలంలోకి ఏనుగులు అడుగుపెట్టాయి. అప్రమత్తమైన అటవీ అధికారులు, రెవెన్యూ, పోలీస్ సిబ్బంది చర్యలు తీసుకుంటున్నారు. చుట్టుపక్కల గ్రామాల్లో దండోరా వేయించారు. పొలం పనులకు ఎవరూ వెళ్లవద్దని రైతులను అధికారులు హెచ్చరించారు.
హడలెత్తిస్తున్న గజరాజులు.. ఆందోళనలో రైతులు - విజయనగరం జిల్లా కురుపాం నియోజకవర్గం
విజయనగరం జిల్లా అర్తం ప్రాంతంలో.. గజరాజులు హల్చల్ చేస్తున్నాయి. వాటిని కట్టడి చేసేందుకు.... అటవీ అధికారులు రక్షణ చర్యలు చేపడుతున్నారు.
![హడలెత్తిస్తున్న గజరాజులు.. ఆందోళనలో రైతులు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4199662-587-4199662-1566395031593.jpg)
పంటపోలాల్లో గజరాజుల హల్చల్!