ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రైతులను భయపెడుతున్న గజరాజులు

విజయనగరం జిల్లా గరుగుబిల్లి మండలంలో ఏనుగులు బీభత్సం సృష్టిస్తున్నాయి. మండల పరిధిలో స్వైర విహారం చేస్తూ పంట పొలాలను ధ్వంసం చేస్తున్నాయి. ఇప్పటికే లాక్​డౌన్​తో నష్టపోయిన రైతులకు మరింత నష్టాన్ని మిగులుస్తున్నాయి

పంటపోలాలను ధ్వంసం చేస్తున్న ఏనుగులు
పంటపోలాలను ధ్వంసం చేస్తున్న ఏనుగులు

By

Published : Apr 29, 2020, 5:25 PM IST

ఏనుగుల స్వైరవిహారం

విజయనగరం జిల్లా గరుగుబిల్లి మండలం నందివానివాలస, గిజబ, తోటపల్లి, సింగనాపురం, బాసంగి గ్రామాల సమీప ప్రాంతంలో ఏనుగులు సంచరిస్తున్నాయి. పంటపొలాలను నాశనం చేస్తూ ఆయా గ్రామాల ప్రజలను హడలెత్తిస్తున్నాయి. పొలాల్లో ఉన్న మోటారు పైపులు, వ్యవసాయ పనిముట్లను ధ్వంసం చేస్తున్నాయి. రహదారులపై వెళ్తున్న వాహనదారులనూ భయపెడుతున్నాయి.

గజరాజులను అడవుల్లోకి పంపేందుకు చర్యలు

ఏనుగులను తిరిగి అడవుల్లోకి పంపేందుకు అటవీశాఖ, రెవెన్యూ విభాగాల సిబ్బంది, పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. పొలం పనులకు ఎవరూ వెళ్లొద్దంటూ అధికారులు హెచ్చరించారు. ఒకవైపు గ్రామంలో కరోనా నేపథ్యంలో లాక్​డౌన్ ఉంటే మరోవైపు గ్రామంలో ఏనుగుల గుంపుతో వ్యవసాయ పనులు చేసుకునేందుకు ఇబ్బందిగా ఉందని బాధితులు ఆవేదన చెందుతున్నారు.

ఇదీ చూడండి:

కురుపాం నియోజకవర్గంలో ఏనుగుల గుంపు సంచారం

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details