ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఏనుగుల స్వైర విహారం... దాడిలో ఆవు, దూడ మృతి - విజయనగరం జిల్లా తాజా వార్తలు

ఏనుగులు స్వైర విహారం చేస్తూ జనాలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఏనుగుల దాడిలో ఆవు, దూడ మృతి చెందాయి. ఈ ఘటన విజయనగరం జిల్లా కొమరాడ మండలంలో జరిగింది.

Elephant ride ... calves killed in attack
ఏనుగుల స్వైర విహారం...దాడిలో దూడ మృతి

By

Published : Dec 7, 2020, 10:25 AM IST

విజయనగరం జిల్లా కొమరాడ మండలంలో ఏనుగుల గుంపు హల్​చల్​ చేసింది. ఈ ఘటనలో ఆవు, దూడ మృతి చెందాయి. స్థానికులు ఆందోళన చెందుతున్నారు. విజయనగరం జిల్లా పార్వతిపురం డివిజన్ గిరిజన ప్రాంతాల్లో కొన్నేళ్లుగా ఏనుగులు హల్ చల్ చేస్తున్నాయి. గత నెలలో ఏనుగలో దాడిలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందగా...తాజాగా ఆవు, దూడ మృతి చెందాయి. పరిసర ప్రాంతాల్లోని రైతుల మోటార్లు, వాహనాలను ధ్వంసం చేశాయి. పంటలు తీవ్రంగా నష్ట పరుస్తున్న ఏనుగులను అటవీ ప్రాంతానికి తరలించాలని స్థానికులు కోరుతున్నారు.

ఇదీ చదవండి:

ఏలూరు: అంతుచిక్కని వ్యాధి.. వందలాదిగా ఆసుపత్రులపాలు

ABOUT THE AUTHOR

...view details