విజయనగరం జిల్లా కొమరాడ మండలం పరశురామ్‌పురంలో రైతుపై ఏనుగు దాడి చేసింది. ఘటనలో లక్ష్మినాయుడు అనే రైతు మృతిచెందాడు. లక్ష్మినాయుడు వేకువజామున వరి పొలానికి వెళ్లగా... పక్కన ఉన్న టేకు తోటలో ఒంటరిగా ఉన్న ఏనుగు ఒక్కసారిగా అతనిపై దాడి చేసింది. దీంతో రైతు అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. రైతు మృతితో పరుశరామ్పురంలో విషాదం నెలకొంది. జిల్లాలో మూడేళ్లలో ఏనుగుల దాడిలో ఆరుగురు మృత్యువాత పడ్డారు. ఇప్పటివరకు కొమరాడలో ముగ్గురు, జియ్యమ్మవలసలో ఇద్దరు, గరుగుబిల్లి మండలాల్లో ఒక్కరు ఏనుగుల దాడికి గురై మృతి చెందారు.
ఏనుగు దాడిలో రైతు మృతి - ఏనుగుల దాడిలో రైతు మృతి వార్తలు
![ఏనుగు దాడిలో రైతు మృతి elephant- attack on farmer](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9529985-370-9529985-1605238132652.jpg)
ఏనుగు దాడిలో రైతు మృతి
08:12 November 13
ఏనుగు దాడిలో రైతు మృతి
కొన్నేళ్లుగా అడవి ఏనుగులు ఈ ప్రాంతంలో సంచరిస్తూ... పంటలను నష్టపరుస్తున్నాయని స్థానికులు తలిపారు. అధికారులు ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
ఇదీ చదవండి:
రెండేళ్ల వయసులోనే అద్భుత ప్రతిభ... జ్ఞాపకశక్తితో ఔరా అనిపిస్తున్న బుడతడు...
Last Updated : Nov 13, 2020, 9:07 AM IST