విజయనగరం జిల్లా బొండపల్లి మండలం అంబటివలస గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై విద్యుదాఘాతం కారణంగా.. కంటైనర్ లారీకి మంటలు అంటుకున్నాయి. సాలూరు నుంచి విశాఖపట్నం వైపు వెళ్తున్న కంటైనర్, అంబటివలస సమీపంలో రహదారి పక్కకు తీసే క్రమంలో పైన ఉన్న విద్యుత్ వైర్లు కంటైనర్‌కు తగిలాయి.
లారీ వెనక టైర్లకు నిప్పు అంటుకొని కంటైనర్ చుట్టూ దట్టమైన పొగ వ్యాపించింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు.