మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. ప్రచారంలో భాగంగా కోటబొమ్మాళిలోని కొత్తమ్మతల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.
ప్రచారంలో మంత్రి అచ్చెన్నాయుడు
By
Published : Mar 13, 2019, 5:55 PM IST
ప్రచారంలో మంత్రి అచ్చెన్నాయుడు
శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గంలోమంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. కోటబొమ్మాళిలోని కొత్తమ్మతల్లి ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు చేశారు.. కోటబొమ్మాళి, సంతబొమ్మాళి మండలాల మీదుగా నందిగాం మండలం కొత్త అగ్రహారం గ్రామం వరకు ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఇంటింటి ప్రచారం చేపట్టారు. ఈసందర్భంగా తెదేపా శ్రేణులు తప్పెటగుళ్ళు, పసుపు జెండాలతో సందడి చేశారు.