విజయనగరం జిల్లా పార్వతీపురం మండలం పడ్డారు గ్రామ సమీపంలో ఎనిమిది వేల సారా పొట్లాలను ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో, టాస్క్ ఫోర్స్ అధికారులు, సిబ్బంది దాడుల్లో పట్టుకున్నారు. సీఐ జైభీమ్ అందించిన వివరాల మేరకు స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో సహాయ సూపరింటెండెంట్ బి.శ్రీనాథ్ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించామన్నారు.
ఎనిమిది వేల సారా పొట్లాలు స్వాధీనం...ఆరుగురు అరెస్ట్ - Eight thousand bags of liquor seized in Parvatipuram
ఒడిశా నుంచి మక్కువ మండలం తరలిస్తున్న ఎనిమిది వేల సారా ప్యాకెట్లను ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో, టాస్క్ ఫోర్స్ అధికారులు, సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. ఆరుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు.

ఎనిమిది వేల సారా పొట్లాలు స్వాధీనం...ఆరుగురు అరెస్ట్
ఒడిశా నుంచి సారా పొట్లాలను రవాణా చేస్తున్న ఆరుగురు వ్యక్తులను అరెస్ట్ చేశామన్నారు. ఒడిశా రాష్ట్రం కోరాపుట్ జిల్లా నాగలి బిడ్డ గ్రామంలో కొనుగోలు చేసి మండలంలో విక్రయించేందుకు సారా పొట్లాలను తరలిస్తున్నారు. సారా రవాణాకు వినియోగించిన ఆటో, మూడు ద్విచక్ర వాహనాలను సీజీ చేసినట్లు చెప్పారు.