ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విజయనగరంలో ముగిసిన ఈనాడు స్పోర్ట్స్​ లీగ్ - 2019 - విజయనగరంలో ముగిసిన ఈనాడు స్పోర్ట్స్​ లీగ్-2019 పోటీలు

విజయనగరంలో ఈనాడు స్పోర్ట్స్ లీగ్- 2019 పోటీలు ముగిశాయి. క్రీడల ముగింపు కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ హరిజవహర్​లాల్ ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు బహుమతులు అందచేశారు.

eenadu sports league concluded in vizianagaram
విజయనగరంలో ముగిసిన ఈనాడు స్పోర్ట్స్​ లీగ్-2019 పోటీలు

By

Published : Jan 11, 2020, 9:15 PM IST

విజయనగరంలో ముగిసిన ఈనాడు స్పోర్ట్స్​ లీగ్-2019 పోటీలు

విజయనగరంలో ఈనాడు స్పోర్ట్స్ లీగ్ - 2019 పోటీలు ముగిశాయి. నగరంలోని విజ్జీ, ఎంఆర్ క్రీడామైదానాల్లో 3 రోజుల పాటు ఈ పోటీలు జరిగాయి. క్రికెట్​తో పాటు ఖోఖో, కబడ్డీ, చదరంగం, బ్యాడ్మింటన్, వాలీబాల్ క్రీడల్లో పోటీలు హోరాహోరీగా సాగాయి. విజయనగరం, శ్రీకాకుళం, విశాఖ, తూర్పుగోదావరి జిల్లాలకు చెందిన జట్లు ఇందులో పాల్గొన్నాయి. క్రీడల ముగింపు కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ హరిజవహర్​లాల్ ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు బహుమతులు అందచేశారు. ఓడినవారు అధైర్యపడొద్దని.. ఓటమి గెలుపునకు మొదటి మెట్టని కలెక్టర్​ వ్యాఖ్యానించారు. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ఈనాడు యాజమాన్యం చేస్తున్న కృషి అభినందనీయమన్నారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details