ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విద్యాకానుక.. అందుకో బాలకా

విజయనగరంలో పాఠశాల విద్యార్థులకు జగనన్న విద్యా కానుక కింద ఏడు రకాల వస్తువులను కిట్‌ రూపంలో అందించారు. జిల్లాలో ఈ పథకాన్ని చీపురుపల్లిలోని జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో పురపాలక, పట్టణాభివృద్ధి మంత్రి బొత్స సత్యనారాయణ లాంఛనంగా ప్రారంభించారు. అదే సమయంలో జిల్లాలోని అన్ని పాఠశాలల్లో ఈ కానుకలు పంపిణీ నిర్వహించారు.

education Gift Receive students at vizianagaram
విద్యాకానుక.. అందుకో బాలకా

By

Published : Oct 8, 2020, 1:19 PM IST

విజయనగరంలో పాఠశాల విద్యార్థులకు జగనన్న విద్యా కానుక కింద ఏడు రకాల వస్తువులను కిట్‌ రూపంలో అందించారు. జిల్లాలో ఈ పథకాన్ని చీపురుపల్లిలోని జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో ఉదయం పది గంటలకు పురపాలక, పట్టణాభివృద్ధి మంత్రి బొత్స సత్యనారాయణ లాంఛనంగా ప్రారంభించారు. అదే సమయంలో జిల్లాలోని అన్ని పాఠశాలల్లో ఈ కానుకలు పంపిణీ నిర్వహించారు.

బయోమెట్రిక్‌ ఆధారంగా... విద్యార్థుల తల్లులు/సంరక్షకులకు బయోమెట్రిక్‌/ఐరిస్‌ ఆధారంగా ఇచ్చారు. ఆ సమయంలో వేలిని ముందు శానిటైజ్‌ చేసి, ఆరిన తర్వాత బయోమెట్రిక్‌ చేస్తారు. బయోమెట్రిక్‌ విధానానికి సంబంధించిన యూజర్‌ మాన్యువల్‌ ఇప్పటికే అందరికీ ఇ-మెయిల్‌ ద్వారా పంపించినట్లు అధికారులు వెల్లడించారు.

రోజుకు 50 మందికే..:కొవిడ్‌ దృష్ట్యా రోజుకు 50 మందికి కిట్లను అందించారు. విద్యార్థులు తల్లి /సంరక్షకులతో ఏదో ఒక రోజు పాఠశాలకు హాజరు కావాలి. విద్యార్థుల సంఖ్య, పాఠశాలలో స్థలం బట్టి అందజేస్తారు. కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ గుంపుగా కాకుండా విడివిడిగా, కొందర్ని మాత్రమే అనుమతించి అందజేసేలా చర్యలు తీసుకున్నారు.

విద్యాకానుక.. అందుకో బాలకా

ఇవీ సూచనలు: ● కిట్‌లో వస్తువులు సరైన పరిమాణంలో రాకపోయినా, దెబ్బతిన్నా వెంటనే పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, ఎంఈవోలను సంప్రదించాలి. ● యూడైస్‌ కోడ్‌, ఛైల్డ్‌ ఇన్‌ఫో వివరాల ప్రకారం ప్రతి విద్యార్థికీ తప్పనిసరిగా అన్ని వస్తువులు అందజేస్తారు. ● కానుకలకు సంబంధించిన ఎటువంటి సందేహాలున్నా 91212 96051, 91212 96052 సహాయ నెంబర్లను ఉదయం పది నుంచి సాయంత్రం ఆరు గంటల్లోపు పనిదినాల్లో సంప్రదించాలి.

విద్యాకానుక.. అందుకో బాలకా
విద్యాకానుక.. అందుకో బాలకా

ఇదీ చదవండి:

మాకవరపాలెంలో మాయాజాలం... క్వారీ లేకుండానే రూ. కోట్ల ఆర్జన

ABOUT THE AUTHOR

...view details