విజయనగరం జిల్లా బొబ్బిలిలోని యుద్ద స్తంభం వద్ద రాజవంశీకులు ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టారు. బొబ్బిలి యుద్దం జరిగిన రోజును పురస్కరించుకోని యుద్ద సమయంలో ప్రాణాలర్పించిన వీరులకు నివాళులు అర్పించారు. రాజవంశీకులు యువరాజు బేబీనాయన మాట్లాడుతూ...బొబ్బిలి యుద్దానికి దేశవ్యాప్తంగా ఒక చరిత్ర ఉందని... నేటి యువత బొబ్బిలి యుద్దం చరిత్ర తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అలనాటి యుద్దానికి ఉపయోగించిన కత్తులు, ఆయుధాలు యుద్ధ స్తంభం వద్ద ఉంచి పూజలు నిర్వహించారు. అనంతరం బేబీనాయన...తాండ్రపాపారాయుడు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
బొబ్బిలి యుద్ధ స్తంభం వద్ద నివాళులు అర్పించిన రాజవంశీకులు - బొబ్బిలి యుద్ధ స్తంభం వద్ద నివాళులు
బొబ్బిలి యుద్దం జరిగిన రోజు పురస్కరించుకోని బొబ్బిలి యుద్ధ స్తంభం వద్ద రాజవంశీకులు ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టారు. యుద్ద స్తంభం వద్ద అసువులు బాసిన వీరులకు నివాళులు అర్పించారు.
బొబ్బిలి యుద్ధ స్తంభం వద్ద నివాళులు అర్పించిన రాజవంశీకులు