Deputy Speaker: డిప్యూటీ స్పీకర్ హోదాలో తొలిసారి విజయనగరంలో అడుగుపెట్టిన కోలగట్ల వీరభద్రస్వామికి వైసీపీ శ్రేణులు, ఆయన అభిమానులు ఘనస్వాగతం పలికారు. కోలగట్ల తాజాగా శాసనసభ ఉప సభాపతి పదవి చేపట్టిన సంగతి తెలిసిందే. హెలికాప్టర్ ద్వారా పై నుంచి పూలజల్లుతూ వీరభద్రస్వామికి ఘనస్వాగంతం పలికారు. మరోవైపు 400కార్లు, 2000 ద్విచక్ర వాహనలతో ర్యాలీ నిర్వహించారు. మంగళ వాయిద్యాలతో వివిధ కళా రూపాలతో రహదారి మొత్తం ప్లెక్సీలు, జెండాలు, స్వాగత బ్యానర్ల మయంగా మరిపోయింది.
డిప్యూటీ స్పీకర్ హోదాలో విజయనగరంలో కోలగట్ల.. ఘన స్వాగతం పలికిన అభిమానులు - స్పీకర్ కోలగట్ల విజయనగర పర్యటన
Deputy Speaker Kolagatla: డిప్యూటీ స్పీకర్ హోదాలో తొలిసారిగా విజయనగరంలో అడుగుపెట్టిన కోలగట్ల వీరభద్రస్వామికి వైకాపా శ్రేణులు, అభిమానులు ఘనస్వాగతం పలికారు. హెలికాప్టర్ ద్వారా పూలు జల్లి అభిమాన్నాన్ని చాటుకున్నారు. సుమారు 400కార్లు, 2000వేలకు పైగా ద్విచక్రవాహనాలతో ర్యాలీ నిర్వహించారు.
విజయనగరంలోని చెల్లూరు నుంచి వై జంక్షన్ , రైల్వే స్టేషన్ రోడ్డు, కన్యకాపరమేశ్వరి దేవాలయం, మూడు లాంతర్లు, సింహచలం మేడ... నగరంలోని వివిధ ప్రాంతాల మీదుగా కోలగట్ల నివాసం వరకు భారీ కాన్వాయ్‌తో కోలాహలంగా ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ సాగుతున్న రహదారి ప్రధాన కొడళ్లుల్లో హెలికాప్టర్ ద్వారా పూలజల్లు కురిపించారు. విజయనగరం జిల్లా ప్రారంభం నుంచి కోలగట్ల నివాసం వరకు సుమారు నాలుగు గంటల పాటు భారీ కాన్వాయ్‌తో స్వాగత ర్యాలీ కొనసాగింది. కోలగట్ల వీరభద్రస్వామికి స్వాగత ర్యాలీతో విశాఖ, విజయనగరం, ఒడిశా మార్గంతో పాటూ విజయనగరంలో అత్యంత రద్దీగా ఉండే ప్రధాన మార్గాల మీదుగా సాగడంతో వాహనదారులు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.
ఇవీ చదంవిడి: