విజయనగరం జిల్లా పార్వతీపురంలో లాక్డౌన్ కారణంగా రోడ్లన్నీ బోసిపోయాయి. ఉదయం 6 నుంచి 9 గంటల వరకు నిత్యావసర సరుకులు విక్రయాలు కొనసాగాయి. పోలీసులు రోడ్లపై తిరిగేవారిని తీవ్రస్థాయిలో హెచ్చరిస్తున్నారు. పూర్తిస్థాయిలో వాహనాలను నిలుపుదల చేశారు. అత్యవసరమైతే తప్ప ద్విచక్ర వాహనాలను అనుమతించలేదు. పోలీసులు పహారలో జనం ఇళ్లకే పరిమితమయ్యారు.
లాక్డౌన్.. ప్రజలు ఇళ్లకే పరిమితం - విజయనగరంలో లాక్డౌన్
కరోనా వైరస్ వ్యాప్తి నివారణలో భాగంగా.. పార్వతీపురంలో కర్ఫ్యూ వాతావరణం కనిపిస్తోంది. లాక్డౌన్ ప్రభావంతో పట్టణాలు, పల్లెలు అనే తేడాలేకుండా అన్ని చోట్ల నిర్బంధం కొనసాగుతోంది.

due to corona virus lockdown at parvathipuram in vizianagaram