విజయనగరం జిల్లా పార్వతీపురంలో విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. పట్టణంలోని రెండు దుకాణాల.. నిత్యావసర సరకుల ధరల పట్టిక విక్రయాల.. తీరును పరిశీలించారు. ముందుగా సరకులు కొనుగోలు చేసి... ధరల తేడాలను గుర్తించారు. జిల్లాలో పలుచోట్ల నిత్యావసర సరకులను అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు గుర్తించామని... నివేదికను కలెక్టర్కు అందజేస్తామని విజిలెన్స్ అధికారులు తెలిపారు.
నిత్యావసర దుకాణాలపై విజిలెన్స్ అధికారుల దాడులు - విజయనగరంలో నిత్యావసర దుకాణాలపై దాడులు
కరోనా నేపథ్యంలో నిత్యావసర సరకుల విక్రయాలపై యంత్రాంగం ప్రత్యేక శ్రద్ధ చూపుతోంది. అధిక ధరల నియంత్రణకు విజిలెన్స్ అధికారులు విస్తృత దాడులు చేపడుతున్నారు. విజయనగంరంలోనూ తనీఖీలు చేపట్టారు.
due to corona lockdown Vigilance officers raids on essential stores in vizianagaram