విజయనగరం జిల్లా శృంగవరపుకోట నియోజకవర్గం ఎస్.కోట, కొత్తవలస పరిధిలోని ఐదు పోలీస్ స్టేషన్లలో సిబ్బందికి ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు మాస్కులు, శానిటైజర్లు, డ్రైఫ్రూట్స్ పంపిణీ చేశారు. కరోనాపై పోరులో పోలీసుల కృషి మరువలేనిదని ఎమ్మెల్యే ప్రశంసించారు. ప్రజలు లాక్డౌన్ నిబంధనలు పాటించి.. పోలీసులకు సహకరించాలని కోరారు.
శృంగవరపుకోటలో పోలీసు సిబ్బందికి శానిటైజర్లు, మాస్కుల పంపిణీ - విజయనగరంలో కరోనా వార్తలు
కరోనాపై పోరులో నిరంతరం శ్రమిస్తోన్న పోలీసులకు దాతలు, ప్రజా ప్రతినిధులు సహాయం అందిస్తున్నారు. విజయనగరం జిల్లాలో పోలీసు సిబ్బందికి నేతలు శానిటైజర్లు, మాస్కులు పంపిణీ చేశారు.
![శృంగవరపుకోటలో పోలీసు సిబ్బందికి శానిటైజర్లు, మాస్కుల పంపిణీ due to corona Distribution of dryfruits, masks and sanitizer to police personnel at Srungavarapukotta in Vijayanagaram](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6910499-700-6910499-1587641208225.jpg)
due to corona Distribution of dryfruits, masks and sanitizer to police personnel at Srungavarapukotta in Vijayanagaram