విజయనగరం జిల్లా గరుగుబిల్లి మండలం లకనాపురం, జియ్యమ్మవలస మండలం పెదబుడ్డి గ్రామానికి చెందిన విద్యార్థుల మధ్య ఘర్షణ తలెత్తింది. ఈ గ్రామాలకు చెందిన కొంతమంది విద్యార్థులు పార్వతీపురంలో వివిధ విద్యా సంస్థల్లో చదువుతున్నారు. బస్సులో ప్రయాణిస్తుండగా...మాటామాటా పెరిగింది. అదికాస్తా దాడికి దారి తీసింది. పెద్దబుడ్డి గ్రామానికి చెందిన విద్యార్థి... మరో ఇద్దరితో కలిసి లకనాపురం యువకులపై బ్లేడుతో దాడి చేశాడు. ఈ ఘటనలో ఐదుగురికి గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించారు. పార్వతీపురం సీఐ దాశరథి గ్రామస్థులతో మాట్లాడారు. ఇరువర్గాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ఉద్రిక్తత తలెత్తకుండా గ్రామస్తులు చర్యలు తీసుకోవాలని కోరారు.
విద్యార్థుల మధ్య ఘర్షణ.. ఐదుగురికి గాయాలు - లకనాపురంలో యువకులపై బ్లేడుతో దాడి వార్తలు
విద్యార్థుల మధ్య జరిగిన ఘర్షణ.. ఐదుగురిని గాయాలపాలు చేసింది. ఈ ఘటన విజయనగరం జిల్లా లకనాపురంలో జరిగింది.

పోలీసుల అదుపులో నిందితులు
TAGGED:
blade attack at vizianagaram