ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కుల దూషణ కేసుపై డీఎస్పీ విచారణ - DSP inquiry into Caste abuse case at nemalimarla

విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం గొర్లెపేట గ్రామంలో ఎనిమిది అడుగుల స్థలంలో వంట కట్టెలు వేయడంపై వివాదం ముదిరింది. దీనిపై కుల దూషణ కేసు నమోదైంది.

DSP inquiry into Caste abuse case at nemalimarla vizainagaram district
కుల దూషణ కేసు పై డీఎస్పీ విచారణ

By

Published : Jun 30, 2020, 12:24 PM IST

ఎనిమిది అడుగుల స్థలంలో వంట కట్టెలు వేయటంపై వివాదం ముదిరింది. విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం గొర్లెపేట గ్రామంలో దీనిపై కుల దూషణ కేసు నమోదైంది. పోలీసులు ఇచ్చిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన బంగారమ్మ ఖాళీ స్థలంలో వంట కట్టెలు వేశారు. సమీప, సంబంధిత గ్రామస్తులు వాటిని తక్షణమే తీయాలంటూ... కులం పేరుతో దూషించినట్లు ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై గ్రామంలో సంబంధిత వ్యక్తులను పోలీసులు విచారించారు. కేసు విచారణకు ప్రత్యేకాధికారిగా డీఎస్పీ మోహన్​రావు హాజరై జరిగిన విషయాలను బాధితుల నుంచి అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఎస్సై అశోక్ కుమార్, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: జిల్లా వ్యాప్తంగా ఎస్​ఈబీ సిబ్బంది దాడులు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details