ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తీవ్ర వర్షాభావంతో ఎండుతున్న పంటలు - rambhadrapuram

విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. వరి నారుమడులు ఎండిపోతున్నాయి. కూరగాయల పంటలకు అపార నష్టం వాటిల్లుతోంది.

కరవు పరిస్థితులు

By

Published : Jul 21, 2019, 2:42 AM IST

వర్షాభావ పరిస్థితులతో ఎండుతున్న పంటలు

విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గంలో లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా బావులు, చెరువులు, నీటికుంటలు ఎండిపోయాయి. పంటలను కాపాడుకోవటానికి చుక్కనీరు లేక రైతులు అల్లాడిపోతున్నారు. రామభద్రపురంలో తీవ్ర దుర్బిక్ష పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ఎంతో ఖర్చుతో విత్తిన కూరగాయ పంటలు టొమాటో, బెండ, బీర, కాకర వంటి పంటలు ఎండిపోయాయి. కొన్ని గ్రామాల్లో వరి నారు మడులు తడిపేందుకు దూరప్రాంతాల నుంచి నీటిని తెచ్చుకుంటున్నారు. వృథాను అరికట్టేందుకు మొక్కలపై కాగితాలు, ఎండుగడ్డిని వేసి నీరు చల్లుతున్నారు. సూర్యరశ్మి లేకుండా విత్తనాలు మొలకెత్తేలా రైతులు కొత్త విధానాన్ని అవలంబిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details