విజయనగరం జిల్లా కొమరాడ మండలంలో గత పన్నెండు రోజులుగా మంచినీరు రాకపోవడంతో స్థానికులు తీవ్ర అవస్థలకు గురవుతున్నారు. మండలంలోని పెద్దవీధి, గొల్లవీధి, సంఘం వీధి, మరడాన వీధి, హనుమాన్ జంక్షన్లో కుళాయిలు పనిచేయకపోవడంతో నీరు రావటం లేదు. దీనికి నిరసనగా స్థానిక మహిళలు బిందెలతో సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఒకవైపు ప్రజలకు అన్ని విధాల భరోసా అని చెబుతున్న ప్రభుత్వం...కనీసం మంచినీరు కూడా ఇవ్వలేని దుస్థితిలో ఉందని సీపీఎం మండల కన్వీనర్ కొల్లిసాంబమూర్తి విమర్శించారు. ఈ విషయంపై స్థానిక ఎంపీడీవో, సంబంధిత ఆర్డబ్ల్యూఎస్ అధికారులను ప్రశ్నించగా...చెప్పితే ఈరోజు, రేపు అంటూ కాలయాపన చేస్తున్నారని ఆయన తెలిపారు. వెంటనే ఉన్నత స్థాయి అధికారులు స్పందించి ఈ సమస్యను తీర్చాలని...లేదంటే సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడతామని ఆయన హెచ్చరించారు.
ఖాళీ బిందెలతో మహిళల నిరసన - komarada mandal
విజయనగరం జిల్లాలో ప్రజలకు తాగునీటి కష్టాలు తప్పడం లేదు. జిల్లాలోని కొమరాడ మండలంలో స్థానిక మహిళలు ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు. విషయంపై స్థానిక అధికారులను ప్రశ్నించగా...ఏవో సాకులు చెప్పి కాలయాపన చేస్తున్నారని సీపీఎం మండల కన్వీనర్ కొల్లిసాంబమూర్తి తెలిపారు. ఇప్పటికైనా అధికారులు చొరవ తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
ఖాళీ బిందెలతో నిరసన తెలుపుతున్న స్థానిక మహిళలు