DRI officials caught gold in AP: బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా రూ. 1.07 కోట్ల విలువ బంగారాన్ని తరలిస్తున్న ఇద్దరిని విశాఖపట్నంలో డీఆర్ఐ అధికారులు అరెస్ట్ చేశారు. వారినుంచి రూ. 1.07 కోట్ల విలువచేసే 1.86 కిలోల బంగారం స్వాధీనం చేసుకునారు. బంగారం స్మగ్లింగ్ గురించి పక్కా సమాచారం ఆధారంగా నిఘా ఉంచి విశాఖపట్నం ప్రాంతీయ యూనిట్ నుంచి డీఆర్ఐ అధికారులు సోదాలు నిర్వహించినట్లు వెల్లడించారు. విశాఖ రైల్వే స్టేషన్‌లో కోల్‌కతా నుంచి షాలిమార్ - సికింద్రాబాద్ ఏసీ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లో బంగారంతో వచ్చిన ఇద్దరు స్మగ్లర్‌ను అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు.
బంగ్లాదేశ్ నుంచి తరలిస్తున్న బంగారం పట్టివేత
DRI officials caught gold: బంగ్లాదేశ్ నుంచి రూ. 1.07 కోట్లు విలువ చేసే బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను విశాఖపట్నంలో డీఆర్ఐ అధికారులు అధుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 1.86 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. బంగారాన్ని కరిగించిన అనంతరం కడ్డీలతోపాటుగా వివిధ ఆకారాలుగా చేసి స్మగ్లింగ్ చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
డీఆర్ఐ
వారికి ఉద్యోగం ఇచ్చిన వారిని అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు. 1.86 కిలో గ్రాముల బంగారం కడ్డీలను, ముక్కల రూపంలో స్వాధీనం చేసుకున్నట్లు డీఆర్ఐ అధికారులు తెలిపారు. స్వాధీనం చేసుకున బంగారం విలువ రూ.1.07 కోట్లు ఉంటుందని వెల్లడించారు. ఈ బంగారాన్ని బంగ్లాదేశ్ నుంచి స్మగ్లింగ్ చేసి, కరిగించిన అనంతరం బంగారు కడ్డీలతోపాటుగా వివిధ ఆకారాలుగా చేసి ముక్కలుగా మార్చినట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైనట్లు డీఆర్ఐ అధికారులు తెలిపారు.
ఇవీ చదవండి