మురుగు ప్రవహించకుండా మురుకి కాలువలపై భారీగా పిచ్చి మెుక్కలు పెరిగినా... అధికారులు స్పందించకపోవటంపై విజయనగరం జిల్లా కొమరాడ మండలంలో బాధిత ప్రజలు ఆగ్రహించారు. శ్రమదానానికి శ్రీకారం చుట్టారు. కొమరాడలో మురికి కాలువలు అధ్వాన్న పరిస్థితికి చేరుకున్నాయని పంచాయతీ అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోవటంపై... గ్రామానికి చెందిన వడ్డి కృష్ణ,మాడాడ వెంకట్ అనే వ్యక్తులు స్వయంగా మురికి కాలువ ప్రక్షాళనకు పూనుకున్నారు. ఈ సందర్భంగా సీపీఎం మండల కన్వీనర్ కొల్లి సాంబమూర్తి మాట్లాడుతూ దోమలు వృద్ధి చెందడానికి ఆస్కారంగా ఉన్న కాలువల వల్ల డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ వంటి విష జ్వరాలు సోకే అవకాశం ఉందని అన్నారు. నాలుగు లక్షల పంచాయతీ నిధులున్నా అధికారులు పారిశుద్ధ్య పనులు చేయటం లేదని ఆరోపించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని వారు కోరారు.
అధికారులు స్పందించలేదు... గ్రామస్తులు స్పందించారు - విజయనగరం
మురికి కాలువలో మురుగు ప్రవహించకుండా పిచ్చి మెుక్కలు చేరి వీధులన్నీ అధ్వానంగా తయారైనా.. అధికారులు స్పందించలేదు. చివరికి గ్రామస్తులే శ్రమదానం చేసి డ్రైనేజీ కాలువను శుభ్రం చేసుకున్నారు. ఈ ఘటన విజయనగరంలో జరిగింది.

అధికారులు స్పందించరు..మేమే చేయాలి పనులు
అధికారులు స్పందించలేదు...గ్రామస్తులు స్పందించారు
ఇదీ చదవండి: