ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

డోలీ కడితే తప్ప అక్కడి వారికి వైద్య సహాయం దొరకదు..! - తాడివలసలో డోలీ కష్టాలు

ఎన్ని ప్రభుత్వాలు మారినా... వారి బతుకులు మాత్రం మారడం లేదు. అత్యవసర సమయంలో ఎక్కడికి వెళ్లాలన్నా కాలినడకే వారికి శరణ్యం. రోగులు, గర్భిణులను ఆస్పత్రికి తీసుకెళ్లాలంటే అంబులెన్స్​ వచ్చే అవకాశం లేదు. విజయనగరం జిల్లా పాచిపెంట మండలం తాడివలసలో గిరిజనుల దుస్థితి ఇది..!

డోలీ కడితే తప్ప అక్కడి వారికి వైద్య సహాయం దొరకదు..!
డోలీ కడితే తప్ప అక్కడి వారికి వైద్య సహాయం దొరకదు..!

By

Published : Feb 19, 2020, 6:01 PM IST

గిరిజనులకు తప్పని డోలీ కష్టాలు

విజయనగరం జిల్లా పాచిపెంట మండలం తాడివలస గిరిజన గ్రామంలో సువర్ణ అనే గర్భిణి ప్రసవానంతరం కొన్ని చెడు పదార్ధాలు గర్భంలోనే ఉండిపోవటం వల్ల అనారోగ్యానికి గురయ్యింది. వైద్య సదుపాయం అందుబాటులో లేకపోవడం వల్ల డోలీ సహాయంతో 5 కిలోమీటర్ల దూరం వరకు తీసుకొచ్చారు. ఆటోలో గురువునాయుడుపేట ఆస్పత్రికి తరలించారు. వైద్యుడు చికిత్స అందించిన అనంతరం తల్లీ బిడ్డ క్షేమంగా ఉందని తెలియడం వల్ల బంధువులు ఊపిరి పీల్చుకున్నారు. బాలింతను మెరుగైన చికిత్స కోసం సాలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా ఆస్పత్రికి 30 కిలోమీటర్ల దూరంలోని గిరిజన గ్రామమైన తాడివలస, చుట్టు పక్కల 10 గ్రామాలకు రోడ్డు సౌకర్యం లేక నానా అవస్థలు పడుతున్నారు.

ఇదీ చదవండి:

అంబులెన్స్ ఆలస్యం... గిరిజనులకు తప్పని డోలీ కష్టాలు

ABOUT THE AUTHOR

...view details