విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలం దారపర్థి పంచాయతీ పల్లపుడుగాడకు చెందిన కస్తూరీ దేముడమ్మకు పురిటి నొప్పులు మొదలయ్యాయి. రహదారి సదుపాయం లేక.. కుటుంబసభ్యులు, బంధుమిత్రులు డోలీ కట్టారు. అడవి మార్గాన కొండలు, గుట్టలు దాటుకుంటూ 11కిలో మీటర్లు డోలీపై మోసుకొచ్చారు. తీరా మైదాన ప్రాంతానికి చేరుకున్నా... వారి కష్టాలు తీరలేదు. 108 కోసం సంప్రదించినe ఫోన్ కలవలేదు. ఇలా మూడు గంటల పాటు వేచి చూసినా ప్రయోజనం లేదు. నొప్పులు అధికం కావటంతో చివరికి ఆటోను ఆశ్రయించారు. శృంగవరపుకోట సామాజిక ఆసుపత్రికి తరలించారు. ఏళ్ల తరబడి ఇలాగే ఇబ్బందులు పడుతున్నామని... ఇప్పటికైనా ప్రభుత్వం కరుణించి తమ గ్రామానికి రహదారి సౌకర్యం కల్పించాలని గిరిపుత్రులు కోరుతున్నారు.
'నేతలు మారినా... మా రాతలు మారవా..?'
ప్రభుత్వాలు, నేతలు మారినా.. వారి రాతలు మాత్రం మారటం లేదు. విజయనగరం మన్యం మహిళలకు ప్రసవం ఒక గండంగా మారుతోంది. పురిటి నొప్పులు వస్తే ఆసుపత్రికి తీసుకువెళ్లేందుకు డోలీ మోత తప్పటం లేదు. అంబులెన్స్ వచ్చే అవకాశం ఉన్నా... రావడం లేదు ఫలితంగా దాదాపు 11 కిలోమీటర్లు ఓ గర్భిణీని డోలీలో మోసుకెళ్లారు.
'నేతలు మారినా... మా రాతలు మారవా..?'