విజయనగరం జిల్లా సాలూరు మండలం మరయ్యపాడు గిరిజన గ్రామానికి చెందిన ఓ గర్భిణీని నాలుగు కిలోమీటర్లు డోలీలో మోసుకొచ్చారు. మైదానప్రాంతానికి తీసుకొచ్చిన తర్వాత అక్కడ నుంచి అంబులెన్స్‌లో భోగవలస పీహెచ్‌సీకి తీసుకెళ్లారు. ఆమె బాబుకి జన్మనిచ్చింది. తమ గ్రామానికి రహదారి సౌకర్యం కల్పించాలని ఎన్నో ఏళ్లుగా గిరిజనులు మొరపెట్టుకుంటున్నా.. పరిస్థితిలో ఎలాంటి మార్పు లేదు. తమకు రహదారి మోక్షం ఎప్పుడు కలుగుతుందోనని ఆ గిరిజనులు ఆశగా ఎదురుచూస్తున్నారు.
గర్భిణికి పురిటి నొప్పులు... 4 కిలోమీటర్లు డోలీలో మోసిన గ్రామస్థులు! - doli problems in Vizianagaram district latest news
విజయనగరం జిల్లాలో గిరిజన గ్రామస్థులకు డోలీ కష్టాలు తీరడం లేదు. కొండల మీదుగా గర్భిణులు, రోగుల తరలింపు ఆగడం లేదు. ఈ క్రమంలోనే మరయ్యపాడుకు చెందిన గర్భిణిని 4 కిలోమీటర్లు డోలీలో మోసుకుపోయారు గ్రామస్థులు.
doli problems