ప్రసవ వేదనతో డోలీపై 5 కిలోమీటర్ల ప్రయాణం - గిరిజన ప్రాంతాల్లో తీరని డోలి కష్టాలు
గిరిజన ప్రాంతాల్లో డోలి కష్టాలు ఇంకా కొనసాగుతున్నాయి. రహదారుల సౌకర్యం లేక గిరిజనులు కష్టాలు పడుతున్నారు. కస్తూరి అనే గర్భిణీని 5 కిలోమీటర్ల మేర తీసుకెళ్లారు స్థానికులు. రహదారి లేక డోలి కట్టి బంధువులు ఆసుపత్రికి తీసుకెళ్లారు.
విజయనగరంజిల్లా గిరిజన ప్రాంతాల్లో డోలి కష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి.రహదారుల సౌకర్యాల లేక...మైదాన ప్రాంతాలకు చేరుకునేందుకు గిరిజనులు...నానాకష్టాలు పడాల్సిన పరిస్థితి నెలకొంది.విజయనగరంజిల్లా పాచిపెంట మండలం ఈతమానువలసకు చెందిన కస్తూరి అనే మహిళకు పురిటనొప్పులు రావటంతో ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు స్థానికులు డోలి కట్టారు.ఆమెను మోసుకుంటూ5కిలోమీటర్ల మేర నడిచారు.అప్పటికే కస్తూరి పరిస్థితి విషమంగా మారటం వల్ల ప్రథమ చికిత్స కోసం సాలూరు సామాజిక ఆసుపత్రికి..అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం జిల్లా ఆసుపత్రికి తరలించారు.ఇలాంటి సంఘటనలు ఎన్ని చోటుచేసుకుంటున్న గిరిజన ప్రాంతాలకు రహదారులు సమకూరకపోవటంపై గిరిజన,ప్రజాసంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.