విజయనగరం జిల్లా నెల్లిమర్ల మిమ్స్ కొవిడ్ ఆసుపత్రిలో పార్వతీపురానికి చెందిన కరోనా బాధిత గర్భిణీకి వైద్యులు విజయవంతంగా శస్త్రచికిత్స పూర్తి చేశారు. మహిళ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. శస్త్ర చికిత్స విజయవంతంగా నిర్వహించిన వైద్య బృందాన్ని జిల్లా కలెక్టర్ హరిజవహర్ లాల్ అభినందించారు.
కరోనా బాధిత గర్భిణీకి విజయవంతంగా శస్త్ర చికిత్స - surgery to corona pregnant woman news in vijayanagaram
విజయనగరంలో కరోనా బాధిత గర్భిణీకి వైద్యులు విజయవంతంగా శస్త్రచికిత్స నిర్వహించారు. ఆమె మగబిడ్డకు జన్మనివ్వగా.. తల్లీబిడ్డలిద్దరూ క్షేమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
కరోనా బాధిత గర్భిణీకి విజయవంతంగా శస్త్రచికిత్స