విజయనగరంలోని పోలీసు సంక్షేమ పెట్రోల్ బంకుకు జిల్లా ఎస్పీ రాజకుమారి శంకుస్థాపన చేశారు. 1.20కోట్ల రూపాయలతో, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఈ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. పెట్రోల్ బంకు నిర్మాణానికి అనుమతులు త్వరితగతిన తీసుకొచ్చేందుకు కృషి చేసిన పోలీసు అధికారులను ఎస్పీ అభినందించారు. పోలీసు సంక్షేమానికి కొద్ది మొత్తంలో మాత్రమే నిధులు మంజూరు అవుతున్నాయని ఎస్పీ అన్నారు. ఈ క్రమంలో జిల్లా పోలీసు శాఖను ఆర్ధికంగా బలోపేతం చేసేందుకు చర్యలు చేపట్టామని తెలిపారు.
పోలీసు సంక్షేమ పెట్రోల్ బంకుకు శంకుస్థాపన - విజయనగరం ఎస్పీ రాజకుమారి తాజా సమాచారం
విజయనగరంలో నిర్మించనున్న పోలీసు సంక్షేమ పెట్రోల్ బంకుకు జిల్లా ఎస్పీ రాజకుమారి శంకుస్థాపన చేశారు. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో 1.20కోట్ల రూపాయలతో ఈ నిర్మాణం చేపట్టనున్నారు. జిల్లా పోలీసు శాఖను ఆర్ధికంగా బలోపేతం చేసేందుకు చర్యలు చేపట్టామని ఎస్పీ అన్నారు.

పోలీసు సంక్షేమ పెట్రోల్ బంకుకు శంఖుస్థాపన
ఇందులో భాగంగా కొన్ని వాణిజ్య నిర్మాణాలు చేపట్టి... వచ్చిన ఆదాయంను పోలీసు సంక్షేమానికి అత్యవసర సమయాల్లో వినియోగిస్తామని అన్నారు. ఐఓసీఎల్ వారు పోలీసు స్థలంలో అత్యాధునిక సౌకర్యాలతో పెట్రోల్ బంకు నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు.
ఇదీ చదవండీ...దమ్ముంటే నా పర్యటనను అడ్డుకోండి: పవన్