విజయనగరం జిల్లా భోగాపురం రైతు భరోసా కేంద్రాన్ని జిల్లా భూసార పరీక్ష కేంద్రం అధికారి సుహాసిని సందర్శించారు. ప్రతి రైతు తప్పనిసరిగా భూసార పరీక్షలు చేయించాలని చెప్పారు. వచ్చిన ఫలితాల ఆధారంగా సరైన పంట వేస్తే.. రెండింతలు అభివృద్ధి చెందుతుందని చెప్పారు.
ఇప్పటికే తమ సిబ్బంది ద్వారా భూసార పరీక్షలు పంట పొలాల్లో చేయించామని అన్నారు. వీటి ఫలితాలు త్వరలోనే రానున్నాయని సమావేశంలో తెలియజేశారు. అనంతరం అధికార సిబ్బందికి భూసార పరీక్షలు ఏ విధంగా చేయాలో తెలియజేశారు.