ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విజయనగరం జిల్లాలో మత్స్యకారులకు ద్విచక్రవాహనాలు పంపిణీ - విజయనగరం జిల్లా తాజా వార్తలు

ప్ర‌ధాన‌మంత్రి మ‌త్స్య‌సంప‌ద యోజ‌న ప‌థ‌కం క్రింద విజయనగరం జిల్లాలోని 35 మంది మ‌త్స్య‌కారుల‌కు రాయితీ ద్విచ‌క్ర వాహ‌నాలు, ఐస్ బాక్సులు, ఇత‌ర సామ‌గ్రిని ఉప మఖ్యమంత్రి పుష్పశ్రీ వాణి పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పంపిణీ చేశారు.

విజయనగరం జిల్లాలో మత్స్యకారులకు రాయితీ ద్విచక్రవాహనాలు పంపిణీ
విజయనగరం జిల్లాలో మత్స్యకారులకు రాయితీ ద్విచక్రవాహనాలు పంపిణీ

By

Published : Aug 7, 2021, 6:00 PM IST

ప్ర‌ధాన‌మంత్రి మ‌త్స్య‌సంప‌ద యోజ‌న ప‌థ‌కం క్రింద విజయనగరం జిల్లాలోని 35 మంది మ‌త్స్య‌కారుల‌కు రాయితీ ద్విచ‌క్ర వాహ‌నాలు, ఐస్ బాక్సులు, ఇత‌ర సామ‌గ్రిని మంత్రులు పంపిణీ చేశారు. క‌లెక్ట‌రేట్ ఆడిటోరియం వ‌ద్ద ఈ కార్య‌క్ర‌మంలో రాష్ట్ర ఉప‌ముఖ్య‌మంత్రి పాముల పుష్ప‌శ్రీ‌వాణి, పుర‌పాల‌క‌, ప‌ట్ట‌ణాభివృద్ది శాఖామంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ‌, జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి వెలంప‌ల్లి శ్రీ‌నివాసరావు, క‌లెక్ట‌ర్ సూర్య‌కుమారి పాల్గొని.. ల‌బ్దిదారుల‌కు యూనిట్ల‌ను అంద‌జేశారు.

చేనేత వస్త్ర ప్రదర్శనను ప్రారంభించిన మంత్రులు..

జాతీయ చేనేత దినోత్స‌వం సంద‌ర్భంగా విజయనగరం క‌లెక్ట‌రేట్ ఆడిటోరియం వ‌ద్ద ఏర్పాటు చేసిన చేనేత వ‌స్త్ర ప్ర‌ద‌ర్శ‌న‌ను, రాష్ట్ర ఉప‌ముఖ్య‌మంత్రి పాముల పుష్ప‌శ్రీ‌వాణి, రాష్ట్ర ప‌ట్ట‌ణాభివృద్ది, పుర‌పాల‌క శాఖమంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ‌, జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి వెలంప‌ల్లి శ్రీ‌నివాస్‌, జిల్లా క‌లెక్ట‌ర్ సూర్య‌కుమారి ప్రారంభించారు. అనంత‌రం ప్ర‌ద‌ర్శ‌న‌లో ఉంచిన వ‌స్త్రాల‌ను, నూలు ఒడికే రాట్నాన్ని ఆసక్తిగా తిలకించారు.

ఇదీ చదవండి:

No Permission: అమరావతి ఉద్యమానికి రేపటితో 600 రోజులు.. ర్యాలీకి అనుమతించని పోలీసులు

ABOUT THE AUTHOR

...view details