విజయనగరం నగరపాలక సంస్థ పరిధిలోని వీధి వ్యాపారులకు గుర్తింపు కార్డులను అధికారులు పంపిణీ చేశారు. నగరంలోని ఆనంద గజపతి కళాక్షేత్రంలో జరిగిన ఈ కార్యక్రమానికి కలెక్టర్ హరి జవహర్ లాల్, విజయనగరం ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి, నగరపాలక సంస్థ కమిషనర్ వర్మ హాజరయ్యారు. 1,388 మంది వీధి వ్యాపారులకు గుర్తింపు కార్డులు అందచేశారు. పేదల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని కలెక్టర్ అన్నారు. వీధి వ్యాపారులనూ ప్రోత్సహించేందుకు పట్టణ పేదరిక నిర్ములన సంస్థ, పట్టణ నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో పేద బడుగు వర్గాల నిర్మూలన కార్యక్రమం చేపట్టిందన్నారు.
వీధి వ్యాపారులకు గుర్తింపు కార్డుల పంపిణీ - distribution-of-identity-cards-to-street-vendors
విజయనగరంలో వీధి వ్యాపారులకు గుర్తింపు కార్డులు పంపిణీ చేశారు. కలెక్టర్ హాజరయ్యారు. వ్యాపారస్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు కార్ఢులు పంపిణీ చేశామని తెలిపారు.

వీధివ్యాపారులకు గుర్తింపు కార్డుల పంపిణీ
వీధివ్యాపారులకు గుర్తింపు కార్డుల పంపిణీ
ఇదీ చదవండి:
సొంతూరు చేర్చినందుకు ఆనందం... ఉపాధి కల్పిస్తే మరింత సంతోషం