తూర్పుగోదావరి జిల్లాలో..
ప్రజల సంక్షేమమే ధ్యేయంగా సీఎం జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ముందుకు సాగుతోందని.. ఏ రాష్ట్రంలో లేని పథకాలను ప్రవేశపెడుతూ.. ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నారని అమలాపురం ఎంపీ చింతా అనురాధ, కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి అన్నారు.
తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గం రావులపాలెం మండలం వెదిరేశ్వరం, గోపాలపురంలో ఇళ్ల పట్టాలను ఎమ్మెల్యే, ఎంపీ లబ్ధిదారులకు అందజేశారు. నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయ భవనాన్ని, పంచాయతీ షాపింగ్ కాంప్లెక్స్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కాంపౌండ్ వాల్‌ను ఎంపీ అనురాధ ప్రారంభించారు.
ప్రకాశం జిల్లాలో...
నవరత్నాల్లో భాగంగా పేదలందరికీ ఇళ్ల పట్టాలు, పక్కా ఇళ్ల నిర్మాణం చేపట్టి ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ప్రభుత్వంగా ఘనత కెక్కుతుందని మంత్రి బాలినేని శ్రీనివాసులు అన్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలలో ఎంటీఆర్ కళా క్షేత్రంలో ఇళ్ల పట్టాల పంపిణీ చేశారు.
అనంతపురం జిల్లాలో..
రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన నిరుపేదలందరికీ ఇంటి పట్టాలు మంజూరు చేయనున్నట్లు రాయదుర్గం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి తెలిపారు. అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలోని డి.హిరేహాల్ మండల కేంద్రంలో ఆయన మహిళ లబ్ధిదారులకు ఇంటి పట్టాలు పంపిణీ చేశారు.
ఇదీ చదవండి: