విజయనగరం ప్రభుత్వ ఘోష ఆస్పత్రిలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు.. విజయనగరం ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్, ఏఐటీయూసీ ఆధ్వర్యంలో బియ్యం, నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. తమ వంతు సహాయంగా పారిశుద్ధ్య కార్మికులకు సరుకులను అందజేశామని యూనియన్ జోనల్ కార్యదర్శి భానుమూర్తి తెలిపారు. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం వారిని తగిన విధంగా ఆదుకోవాలని కోరారు.
పారిశుద్ధ్య సిబ్బందికి సరుకుల పంపిణీ - Distribution of essentials to sanitation staff at vizianagaram
కరోనా పోరులో ముందుండి నడిపిస్తున్న వారికి సహాయం చేయాలనుకున్నారు. ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్, ఏఐటీయూసీ ఆధ్వర్యంలో విజయనగరం ప్రభుత్వాస్పత్రిలో పారిశుద్ధ్య సిబ్బందికి సరుకుల పంపిణీ చేపట్టారు.
![పారిశుద్ధ్య సిబ్బందికి సరుకుల పంపిణీ Distribution of essentials to sanitation staff at vizianagaram](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6854249-212-6854249-1587287801866.jpg)
Distribution of essentials to sanitation staff at vizianagaram