కరోనా విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో విజయనగరంలో 69 మంది నిరుపేద కుటుంబాలకు హెల్త్ అండ్ వెల్ఫేర్ సొసైటీ సంస్థ, సన్ రైజ్ హోమ్ ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. లాక్డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన పేదలకు తమ వంతు సహాయం అందించామని రాష్ట్ర బాలల కమిషన్ ఛైర్మన్ అప్పారావు అన్నారు. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో సహాయం చేసేందుకు దాతలు ముందుకు రావాలని ఆయన కోరారు.
విజయనగరంలో పేదలకు నిత్యావసర వస్తువులు పంపిణీ - lockdown updates
రాష్ట్రవ్యాప్తంగా లాక్డౌన్ కఠినంగా అమలవుతోంది. ఈ నిబంధన కారణంగా ఉపాధి కోల్పోయిన పేదలు, కూలీలు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీరి అవస్థను గమనించిన కొందరు దాతలు సహాయం చేసేందుకు ముందుకు వస్తున్నారు. తమ వంతు తోడ్పాటును అందిస్తూ దాతృత్వాన్ని చాటుకుంటున్నారు.
విజయనగరంలో పేదలకు నిత్యావసర వస్తువులు పంపిణీ