లాక్‌డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన పేదలకు విజయనగరం జిల్లా పార్వతీపురంలో.. భాజపా నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ ఉమామహేశ్వరరావు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. పారిశుద్ధ్య కార్మికులకు మాజీ కౌన్సిలర్ శ్రీనివాసరావు సరుకులు అందించారు. రిక్షా కార్మికులు, ట్రాన్స్‌జెండర్లకు ఉమామహేశ్వరరావు బియ్యం, గుడ్లు అందజేశారు. ఆస్పత్రిలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు ఓ ఆశ్రమ నిర్వాహకులు కూరగాయలు సరఫరా చేశారు. పాచిపెంట మండలంలో.. ఎస్ఐ గంగరాజు ఆధ్వర్యంలో 150 గిరిజిన కుటుంబాలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. వైకాపా ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర సాలూరు పట్టణంలోని విలేకరులకు నిత్యావసర సరుకులు అందచేశారు.
పేదలకు అండగా.. మానవత్వం నిండుగా - విజయనగరంలో కరోనా వార్తలు
లాక్‌డౌన్ నేపథ్యంలో పేదవారికి సహాయం చేసేందుకు ఎంతో మంది దాతలు ముందుకు వస్తున్నారు. తమకు తోచిన సహాయం చేస్తున్నారు. ఎంతో మంది పేదవారికి అండగా నిలుస్తున్నారు.
Distribution of essential commodities to the poor in Vijayanagara