విజయనగరం జిల్లా చీపురుపల్లి సబ్ డివిజన్ పరిధిలోని చీపురుపల్లి, గారివిడి, గుర్ల, నెలిమర్ల, మెరక ముడిదం, మండలాల్లో 94 రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. గరివిడి మండలం కుమరం గ్రామంలోని రైతుభరోసా కేంద్రంలో విత్తనాలను రైతులకు అధికారులు పంపిణీ చేశారు. రైతు భరోసా కేంద్రాలతో మండల కేంద్రాలకు వెళ్లి కొనుక్కొనే శ్రమని, సమయాన్ని తగ్గించే అవకాశం ఉందన్నారు. దళారులను ఆశ్రయించక రైతు భరోసా కేంద్రాలను ఉపయోగించుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు కోరారు.
రైతు భరోసా కేంద్రాల్లో విత్తనాల పంపిణీ - seeds distribution latest news
విజయనగరం జిల్లాలో రైతు భరోసా కేంద్రాల్లో విత్తనాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ జేడి శ్రీమతి ఆశాదేవి పలువురు వ్యవసాయశాఖ అధికారులు పాల్గొన్నారు.
రైతులకు భరోసా విత్తనాలు పంపిణీ