దిశ మహిళా పోలీసులకు ప్రత్యేకంగా రూపొందించిన వాహనాలను విజయనగరం జిల్లాలో ఎస్పీ రాజకుమారి జెండా ఊపి ప్రారంభించారు. 31 దిశ ద్విచక్ర వాహనాలు, రెండు తుఫాన్ వాహనాలు, ఒక ఇన్వెస్టిగేషన్ టీం వాహనాన్ని జిల్లాకు కేటాయించారు. మహిళల భద్రతకు పెద్ద పీట వేస్తూ, దిశ మహిళా పోలీసు స్టేషన్లను మరింత శక్తివంతంగా తీర్చిదిద్దేందుకుగాను సీఎం జగన్, డీజీపీ గౌతమ్ సవాంగ్ కృషిచేస్తున్నారని ఆమె అన్నారు.
'నేరాలను అరికట్టేందుకు ఈ వాహనాలు ఎంతో ఉపయోగకరం' - దిశ యాప్ వార్తలు
విజయనగరం జిల్లాలో దిశ వాహనాలను జిల్లా ఎస్పీ ప్రారంభించారు. దిశ పోలీస్టేషన్ ద్వారా సత్వర న్యాయం అందించేందుకు ప్రభుత్వం.. దిశ మహిళా పోలీసులకు ప్రత్యేకంగా ఇవి కేటాయించింది.మహిళల రక్షణ కోసం ప్రభుత్వం కృషిచేస్తోందని ఆమె అన్నారు.
విజయనగరం జిల్లాలో దిశ వాహనాలు
పోలీసు బృందాలు సకాలంలో సంఘటనా స్థలానికి చేరుకునేందుకు ఇవి ఎంతో ఉపకరిస్తాయన్నారు. దిశ ద్విచక్ర వాహనాలను జిల్లా వ్యాప్తంగా ఉన్న ఉమెన్ హెల్ప్ డెస్క్ లలో వినియోగిస్తామన్నారు. మహిళలపై జరిగే నేరాలను అరికట్టేందుకు ఈ వాహనాలు ఎంతో ఉపయోగకరమన్నారు.
ఇదీ చూడండి.విజయవాడలో 'అరణ్య' సినిమా ప్రీ రిలీజ్ వేడుక
TAGGED:
disha app