విద్య నేర్పిన గురువుకు వినూత్నంగా నివాళి అర్పించారు ఆయన శిష్యులు. విజయనగరం జిల్లా సాలూరు పట్టణానికి చెందిన నాగిరెడ్డి మంగళవారం మృతిచెందారు. ఈయన గత 50 ఏళ్లుగా స్థానికులు, పరిసర ప్రాంత ప్రజలకు సాము నేర్పేవారు. ఆయన వద్ద విద్య నేర్చుకున్న వారంతా బుధవారం అంతిమయాత్రకు హాజరయ్యారు. తమ గురువు నేర్పిన విద్యను శవయాత్రలో ప్రదర్శించారు. కర్రలు, కత్తులు చేతపట్టి సాము చేస్తూ గురువుకు నివాళి అర్పించారు. గురువు రుణం తీర్చుకోవడానికే అంతిమయాత్రకు హాజరై సాము చేశామని వారు చెప్పారు.
విద్య నేర్పిన గురువుకు... వినూత్న నివాళి - గురువుకు ఘనమైన నివాళి
సాలూరు పట్టణంలోని ప్రధాన రహదారిలో పాడెపై మృతదేహాన్ని నలుగురు మోసుకుంటూరు వెళ్తున్నారు. వీరి ముందు కొందరు వ్యక్తులు కర్రలు, కత్తులు చేతపట్టి సాము చేస్తున్నారు. వింతగా అనిపించటంతో ప్రజలందరూ గుమిగూడారు. పాడె ముందు ఈ విన్యాసాలేంటని అనుకున్నారు. కానీ ఆ తరువాత విషయం తెలుసుకొని ఆశ్చర్యపోయారు.
విద్య నేర్పిన గురువుకు... వినూత్న నివాళి