ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పాఠశాల లేకపోయినా.. విద్యార్థులకు డిజిటల్ విద్య

ఆ గ్రామంలో పాఠశాల లేదు...కానీ తరగతులు జరుగుతాయి. ఒక్కడే ఉపాధ్యాయుడు..అన్నీ తానై విద్యార్థులకు వినూత్న రీతిలో పాఠాలు చెబుతున్నాడు. ఇంతకీ ఆ పాఠశాల ఎక్కడుందో తెలుసుకుందామా!

Digital education for students without school at vizianagaram
ట్యాబ్ లో అప్లికేషన్ ద్వారా అచ్చులు

By

Published : Dec 30, 2019, 7:32 AM IST

పాఠశాల లేకపోయిన ..విద్యార్థులకు డిజిటల్ విద్య

విజయనగరం జిల్లా సాలూరు మండలం మావోడు పంచాయతీ కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలో వినూత్న రీతిలో బోధన సాగుతోంది. దీనికోసం ఓ ఉపాధ్యాయుడు చిత్తశుద్ధితో పని చేస్తున్నాడు. పాఠశాలలో 38 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. పాఠశాలకు సొంత భవనం లేదు... గ్రామంలో ఉన్న చర్చిలోనే తరగతులు నిర్వహిస్తున్నారు. మౌలిక వసతులు లేకున్నా అటు ఉపాధ్యాయుడిలో గానీ ఇటు విద్యార్థుల్లో గాని ఎటువంటి నిరాసక్తత లేదు. ఉపాధ్యాయుడు విద్యార్థులకు ట్యాబ్​లో సులువుగా లెక్కలు, తెలుగు అక్షరాలు నేర్పిస్తున్నాడు. పాఠాలను గిరిజన విద్యార్థులు ఎంతో ఆసక్తిగా వింటున్నారు. ఉపాధ్యాయుడు వినూత్నరీతిలో బోధిస్తుంటే వాటిని విద్యార్థులు అనుసరిస్తున్నారు. మారుమూల గిరిజన గ్రామంలో డిజిటల్​ తరగతులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయుడు అందరికీఆదర్శంగా నిలుస్తున్నాడు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details