రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాల్లో డిజిటల్ కియోస్క్‌లను ఏర్పాటు చేసింది. దీనిపై మొదటిసారిగా ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లో శిక్షణ ప్రారంభించారు. రైతులకు గ్రామస్థాయిలో విత్తనాలు, ఎరువులు, పురుగుల మందుల సరఫరాకు డిజిటల్ కియోస్క్ ఉపయోగ పడుతుందని అధికారులు తెలిపారు.
'డిజిటల్ కియోస్క్‌ల వినియోగంపై శిక్షణ' - డిజిటల్ కియోస్క్
రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేస్తున్న రైతు భరోసా కేంద్రాల్లో.. డిజిటల్ కియోస్క్‌ల వినియోగంపై అవగాహన కల్పిస్తున్నారు. ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాలకు చెందిన వ్యవసాయ శాఖ అధికారులకు, ఆగ్రోస్ వ్యవసాయ శిక్షణ కేంద్రాల అధికారులకు... డిజిటల్ కియోస్క్‌ల గురించి విజయనగరం రైతు శిక్షణ కేంద్రంలో అవగాహన కల్పిస్తున్నారు.
digital classes
ఈ కార్యక్రమంలో విజయనగరం జిల్లా వ్యవసాయ సంయుక్త సంచాలకులు డి.ఆశాదేవి, ఆత్మ పథకం సంచాలకులు డి.లక్ష్మణరావు, డిజిటల్ కియోస్క్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ నిరంజన్ కుమార్, అగ్ మెటల్ ఇండియా లిమిటెడ్ ప్రతినిధులు ప్రమోద్, నిరంజన్ కుమార్ పాల్గొన్నారు.
ఇవీ చదవండి:ఎయిర్‌లిఫ్ట్: 7 రోజులు.. 64 విమానాలు.. 14,800 మంది!