విజయనగరం జిల్లాలో పెట్రోల్ దాడి బాధితులను కాపాడిన పోలీసులను విశాఖ రేంజ్ డీఐజీ రంగారావు ప్రశంసించారు. ఆ పోలీసులకు ప్రోత్సాహక నగదు, ప్రశంసాపత్రాలు అందించారు. దిశ కాల్‌కు సమాచారం వచ్చిన వెంటనే పోలీసులు స్పందించారని అన్నారు. త్వరగా ఘటనాస్థలానికి వెళ్లి బాధితులను ఆస్పత్రికి తరలించారని తెలిపారు. వర్షాన్ని లెక్క చేయక 25 కిలోమీటర్ల దూరాన్ని 21 నిమిషాల్లోనే పోలీసులు చేరుకుని ఆటోలో భోగాపురం ఆస్పత్రికి తరలించారని తెలిపారు.
ఏం జరిగిందంటే..
విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం చౌడువాడలో యువతిపై ఓ యువకుడు పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటన సంచలం సృష్టించింది. అడ్డుకోబోయిన యువతి అక్క, ఆమె కుమారుడికి.. గాయాలయ్యాయి. ముగ్గురినీ విజయనగరం జిల్లా ఆస్పత్రికి బాధితుల్ని హుటాహుటిన తరలించారు. ఈ ఘాతుకానికి పాల్పడిన వ్యక్తి నరవ ప్రాంతానికి చెందిన రాంబాబుగా పోలీసులు గుర్తించారు.