Korukonda Sainik School Diamond Jubilee Celebrations : విజయనగరం జిల్లాలోని కోరుకొండ సైనిక్‌స్కూల్ వజ్రోత్సవాల సందర్భంగా విద్యార్థుల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. ప్రిన్సిపల్, కర్నల్ అరుణ్ కులకర్ణి జ్యోతి వెలిగించి పాఠశాల ఆవరణలో మంగళవారం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఇక్కడ చదివినవారంతా దేశవిదేశాల్లో ఉన్నత స్థానాల్లో ఉన్నారని ఆనందం వ్యక్తం చేశారు. అనంతరం సైనిక్ స్కూల్‌పై రూపొందించిన పోస్టల్ కవర్‌ను విడుదల చేశారు. పూర్వ విద్యార్థులు ఆన్‌లైన్ ద్వారా వేడుకలను వీక్షించారు. సహాయ ప్రిన్సిపల్ వింగ్ కమాండర్ ఎస్.కేశవన్, పరిపాలనాధికారి లెఫ్టినెంట్ కమాండర్ అభిలాష్ బాలచంద్రన్ తదితరులు పాల్గొన్నారు.
విజయనగరంలో సైనిక్ స్కూల్ వజ్రోత్సవాలు.. ఆకట్టుకున్న విన్యాసాలు - Korokonda Sainik School Diamond Jubilee Celebrations
Korukonda Sainik School Diamond Jubilee Celebrations : విజయనగరం జిల్లాలోని కోరుకొండ సైనిక్ స్కూల్‌లో ఘనంగా వజ్రోత్సవాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. అనంతరం సైనిక్ స్కూల్‌పై రూపొందించిన పోస్టల్ కవర్‌ను విడుదల చేశారు.
korukonda sainic school