ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'పొర్జా పైడి కులస్థులను గిరిజనులుగా ధ్రువీకరించాలి' - Social Awareness Forum news

పొర్జా పైడి కులస్థులను గిరిజనులుగా ధ్రువీకరించాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేశారు. సామాజిక చైతన్య వేదిక ఆధ్వర్యంలో విజయనగరం కలెక్టరేట్ వద్ద ఆందోళన చేశారు.

Social Awareness Forum
సామాజిక చైతన్య వేదిక ధర్నా

By

Published : Dec 28, 2020, 9:24 PM IST

సుప్రీంకోర్టు - హైకోర్టు తీర్పులకు లోబడి పొర్ణ పైడి కులస్థులను గిరిజనులుగా ధ్రువీకరించాలని డిమాండ్ చేస్తూ విజయనగరం కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టారు. సామాజిక చైతన్య వేదిక ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ.. 1950లో భారత రాజ్యాంగం గిరిజన జాతులు, తెగలు, వాటి ఉప జాతుల జాబితాను ఇండియన్ గెజిట్ లో ప్రకటించిందన్నారు.

ఆ గెజిట్​లో పొర్ణ పైడి జాతిని గిరిజనులుగా గుర్తిస్తూ సుప్రీంకోర్టు, హైకోర్టులు పలుమార్లు తీర్పును ప్రకటించాయని చెప్పారు. ఐనప్పటికీ.. కేంద్ర - రాష్ట్ర ప్రభుత్వాలు న్యాయస్థానాల తీర్పును అమలు చేయటం లేదని వాపోయారు. ప్రభుత్వాల నిర్లక్ష్యంతో పొర్ణ పైడి కులస్థులు పలు రకాలుగా నష్టపోయారని అన్నారు. ఇప్పటికైన ప్రభుత్వం స్పందించి.. రాజ్యాంగం కల్పించిన హక్కులు అందేలా చూడాలని కోరారు.

ఇదీ చదవండి: 'మాన్సాస్ కార్యాలయం తరలింపు ప్రయత్నం వెనుక కుట్ర'

ABOUT THE AUTHOR

...view details