విజయనగరం జిల్లాలో రోజురోజుకి కరోనా వైరస్ విజృంభిస్తోంది. దీంతో అధికారులు మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని.. బాధితులకు చికిత్స సౌకర్యాలు మెరుగుపరచాలని డిమాండ్ చేస్తూ జిల్లా దళిత హక్కుల జేఏసీ ధర్నా చేపట్టింది. కలెక్టరేట్ వద్ద ఆ సంఘం కార్యదర్శి గండ్రేటి సత్యనారాయణ ధర్నా నిర్వహించారు.
'కరోనా ఫలితాలు త్వరగా వచ్చేలా చూడాలి' - విజయనగరంలో కోవిడ్ వైరస్ వార్తలు
జిల్లాలో కరోనా మహామ్మారి విస్తరిస్తోన్న నేపథ్యంలో ఎస్సీ బాధితులకు సరైన చికిత్సలు, సౌకర్యాలు కల్పించాలని కోరుతూ కలెక్టరేట్ వద్ద దళిత హక్కుల జేఏసీ ఆందోళన చేపట్టారు. సకాాలంలో టెస్ట్లు చేయించి ఫలితాలు వచ్చేలా చూడాలన్నారు.
కరోనా రోగులను రక్షించండంటూ దళిత జేఏసీ ఆధ్వర్యంలో ధర్నా
జిల్లాలో నిత్యం వందలాది మంది కొవిడ్-19 వైరస్ బారిన పడుతున్నారు. కానీ సకాలంలో నిర్దారణ పరీక్షలు జరగటం లేదు. పరీక్షలు చేసినా ఫలితాలు వచ్చేలోపు వృద్ధులు మృత్యువాత పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో పరీక్ష కేంద్రాల సంఖ్యను పెంచాలని ఆయన డిమాండ్ చేశారు. అదేవిధంగా కొవిడ్ ఆసుపత్రులు, కేర్ సెంటర్లలో వైద్య సదుపాయాలు మెరుగుపరచాలని.. పౌష్టికాహారాన్ని అందించాలని సత్యనారాయణ అధికారులను డిమాండ్ చేశారు .
ఇవీ చదవండి