ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కస్తూర్బా విద్యాలయం ముందు విద్యార్థి సంఘాల ధర్నా - విజయనగరం జిల్లా వార్తలు

విజయనగరం జిల్లాలోని కరాశవలసలో ఉన్న కస్తూర్బా గాంధీ విద్యాలయం ముందు ఎస్ఎఫ్​ఐ నాయకులు, విద్యార్థులు ధర్నా చేపట్టారు. సోమవారం అనారోగ్యంతో బాలిక మృతి చెందిందని.. ఆమె కుటుంబానికి పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.

కస్తూర్బా విద్యాలయం ముందు విద్యార్థి సంఘాల ధర్నా
కస్తూర్బా విద్యాలయం ముందు విద్యార్థి సంఘాల ధర్నా

By

Published : Mar 23, 2021, 10:21 PM IST

విజయనగరం జిల్లా సాలూరు మండలం కరాశవలస గ్రామంలో ఉన్న కస్తూర్బా గాంధీ విద్యాలయం ముందు ఎస్ఎఫ్​ఐ నాయకులు, విద్యార్థులు ధర్నా చేపట్టారు. ఇదే పాఠశాలలో పదోతరగతి చదువుతున్న గూల లక్ష్మి అనే బాలిక సోమవారం అనారోగ్యంతో కేజీహెచ్​లో మృతి చెందింది. ఈ విషయమై విద్యార్థులతో మాట్లాడేందుకు విద్యార్థి సంఘాల నాయకులు అక్కడి చేరుకున్నారు. ఆహారం బాగోలేదని, మెనూ సక్రమంగా అమలు చేయడం లేదని వారు వాపోయారు.

సంఘాల నాయకులు... అక్కడి విద్యార్థులతో కలిసి నిరసన చేపట్టారు. ఉదయం 9 గంటల నుంచి రాత్రి వరకు ధర్నా చేశారు. ఎంఈవో నాగమల్లేశ్వరరావు విద్యాలయానికి చేరుకుని వారితో మాట్లాడారు. మెనూ సక్రమంగా అమలు చేయాలని... అలాగే చనిపోయిన బాలిక కుటుంబానికి పదిలక్షల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details