ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గిరిజన విద్యార్థి కుటుంబాన్ని పరామర్శించిన ఉపముఖ్యమంత్రి - vijayanagaram district

విజయనగరం జిల్లా ఎస్​కోట మండలంలోని గిరిజన పాఠశాలలో మృతి చెందిన విద్యార్థి కుటుంబాన్ని ఉపముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి పరామర్శించారు. బాధిత కుటుంబానికి తనవంతు సాయం చేశారు. వారిని అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. పాఠశాలను సందర్శించి సౌకర్యాల పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు.

గిరిజన విద్యార్థి కుటుంబాన్ని పరామర్శించిన ఉపముఖ్యమంత్రి

By

Published : Aug 2, 2019, 9:07 AM IST

విజయనగరం జిల్లా ఎస్ కోట మండలం మూల బొడ్డవర గ్రామంలో అనారోగ్యంతో మృతి చెందిన గిరిజన ఉన్నత పాఠశాల విద్యార్థి కుటుంబాన్ని ఉపముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి పరామర్శించారు. విద్యార్థి మృతికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం తరఫున న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. సొంతంగా 25 వేల రూపాయలు ఆది సాయం అందించారు. అనంతరం ఎస్ కోటలోని గిరిజన ఉన్నత పాఠశాలను సందర్శించారు. పాఠశాలలోని సౌకర్యాల పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. గిరిజన పాఠశాలలో సదుపాయాలు మెరుగుపరుస్తామన్నారు. బడ్జెట్​లో గిరిజన విద్యకు అధిక నిధులు కేటాయించామన్నారు.

గిరిజన విద్యార్థి కుటుంబాన్ని పరామర్శించిన ఉపముఖ్యమంత్రి

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details