విజయనగరంలో శనివారం జరిగిన వైకాపా జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో ఉపముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి కంట నీరు పెట్టారు. వేదికపై వైకాపా ముఖ్య నేతలు ఉన్నప్పుడే ఆమె కన్నీరు పెట్టగా అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. కన్నీటి పర్యంతమైన ఆమెను రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి ఓదార్చుతున్నట్లు కనిపించింది. అయితే, భర్త పరీక్షిత్ రాజును వేదికపైకి పిలవలేదన్న కారణంగానే ఆమె కన్నీరు పెట్టి ఉంటారనే అనుమానం వ్యక్తమవుతోంది. భర్తను పిలవకపోవటం వల్ల తీవ్ర ఆవేదనకు గురైన ఆమె... ఈ విషయాన్ని విజయసాయిరెడ్డికి చెప్పుకుని కంట తడి పెట్టుకున్నట్లు సమాచారం. విజయసాయిరెడ్డి సూచన మేరకు తిరిగి పరీక్షిత్ రాజును వేదికపైకి ఆహ్వానించగా ఆమె సభా కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు.
సభా వేదికపై కన్నీరు పెట్టుకున్న ఉప ముఖ్యమంత్రి
విజయనగరం జిల్లాలో నిర్వహించిన ఓ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి కన్నీటి పర్యంతమయ్యారు. వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి పక్కన ఉండగానే బోరుమన్నారు. తన భర్తను సభా వేదికపైకి పిలవకపోవటమే దీనికి కారణమని తెలుస్తోంది.
deputy cm puspha srivani cried on stage