ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'జగనన్నా.. మీ రుణం తీర్చుకోలేనిది' - ఉపముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి తాజా వార్తలు

తన మీద నమ్మకంతో.. మొదటి మంత్రివర్గంలోనే మంత్రిగా, ఉపముఖ్యమంత్రిగా అవకాశమిచ్చిన జగనన్న రుణం ఎప్పటికీ తీర్చుకోలేనిదని.. ఉప ముఖ్యమంత్రి పుష్పశ్రీ వాణి అన్నారు. ఆయన నమ్మకాన్ని వమ్ము చేయకుండా తన బాధ్యతలు సక్రమంగా నెరవేరుస్తానని తెలిపారు.

deputy cm pushpasri vani completed one year regime
ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపిన పుష్పశ్రీవాణి

By

Published : Jun 8, 2020, 4:46 PM IST

సామాన్య గిరిజన మహిళ అయిన తనకు మంత్రిగా, ఉపముఖ్యమంత్రిగా అవకాశమిచ్చిన.. సీఎం జగన్ రుణం తీర్చుకోలేనిదని పుష్పశ్రీవాణి అన్నారు. ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకుని ఏడాది అయిన సందర్భంగా విజయనగరం జిల్లా చినమేరంగిలో కేక్ కట్ చేశారు. తనను నమ్మి ముఖ్యమైన పదవినిచ్చిన ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.

తనకు అండగా నిలబడి, గెలిపించిన నియోజకవర్గ కార్యకర్తలను ఎప్పటికీ మర్చిపోనని అన్నారు. తన ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తానని.. అందర్నీ కలుపుకొని సమస్యలు పరిష్కరించే దిశగా అడుగులు వేస్తానని ఉద్ఘాటించారు. ఆమెకు శుభాకాంక్షలు తెలిపేందుకు వైకాపా కార్యకర్తలు తరలివచ్చారు.

ABOUT THE AUTHOR

...view details