విజయనగరం జిల్లా పార్వతీపురం ఐటీడీఏ కార్యాలయంలో వివిధ విభాగాల ఇంజినీరింగ్ అధికారులతో అభివృద్ధి పనులపై ఉపముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి సమీక్ష నిర్వహించారు. గిరిశిఖర గ్రామాల్లో నివసించే గిరిజనులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. చాలా ఏళ్లుగా సరైన రోడ్లు లేక డోలీలపై రోగులు, గర్భిణులను తరలించే గిరిశిఖర గ్రామాలపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. 280కి పైగా సమస్యలు ఉన్న గ్రామాల అనుసంధానం కోసం ట్రైబల్ వెల్ఫేర్ ఇంజినీరింగ్ విభాగం ద్వారా ప్రతిపాదనలు పంపించారని.. వాటికోసం రూ.411 కోట్ల నిధులు కేటాయించారని అధికారులు తెలిపారు. సమస్య ఉన్న ప్రతిచోటా సీసీ, బీటి రోడ్లతో అనుసంధానం చేయాలని ఉపముఖ్యమంత్రి సూచించారు. విభాగాల వారీగా మంజూరైన రహదారుల వివరాలను అధికారులు వివరించారు.
గిరిశిఖర గ్రామాలపై ప్రత్యక శ్రద్ధ చూపండి: ఉపముఖ్యమంత్రి - vizianagarm latest news
విజయనగరం జిల్లాలోని గిరిశిఖర ప్రాంతాల్లో నివసించే ప్రజల సమస్యలు పరిష్కరించాలని ఉపముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి అధికారులను ఆదేశించారు. గ్రామాలను అనుసంధానం చేస్తూ రహదారులు నిర్మించాలని, ఇకపై డోలీ సమస్యలు ఉండొద్దని స్పష్టం చేశారు. రోడ్ల నిర్మాణాలకు మంజూరైన నిధులు ఖర్చు చేయాలని ఆదేశించారు.
ఉపముఖ్యమంత్రి