ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'వైద్య రంగంపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోంది' - కురుపాంలో ఉపముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి వార్తలు

విజయనగరం జిల్లా కురుపాంలో ఆసుపత్రి భవనాల నిర్మాణానికి ఉపముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి శంకుస్థాపన చేశారు. పల్లెల్లో మెరుగైన వైద్యం అందించేందుకు తమ ప్రభుత్వం కృషిచేస్తోందని తెలిపారు.

pamula pushpa sri vani
పాముల పుష్పశ్రీవాణి, ఉపముఖ్యమంత్రి

By

Published : Nov 19, 2020, 5:49 PM IST

ప్రభుత్వం వైద్యరంగంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని ఉపముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి అన్నారు. విజయనగరం జిల్లా కురుపాంలో ఆసుపత్రి భవనాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.

30 పడకల ఆసుపత్రులను 50 పడకలకు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. కురుపాంలో అప్​గ్రేడ్ అయిన ఆసుపత్రుల నిర్మాణాలకు నాబార్డు రూ. 11కోట్లు మంజూరు చేసింది. వీటికి ఉపముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. ఆమె మాట్లాడుతూ.. మారుమూల పల్లెల్లో మెరుగైన వైద్యం అందించేందుకు తమ ప్రభుత్వం కృషిచేస్తోందన్నారు. గిరిజన ప్రాంతాల్లో మరిన్ని మౌలిక సదుపాయాలతో సేవలందించేలా పనిచేస్తున్నామన్నారు.

ABOUT THE AUTHOR

...view details