గిరిజన యువత, మహిళలు స్వయం ఉపాధి వైపు అడుగులు వేయాలని ఉపముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి సూచించారు. విజయనగరం జిల్లా కురుపాం మండలం దండుసుర గ్రామ గిరిజన మహిళలకు డీసీసీబీ బ్యాంకు ఇచ్చిన రూ. 3.30లక్షల చెక్కును అందజేశారు. అటవీ ఉత్పత్తులతో వస్తువుల తయారీ శిక్షణ పూర్తిచేసుకున్న మహిళలకు నాబార్డు సౌజన్యంతో డీసీసీబీ బ్యాంకు రుణం మంజూరుచేసింది. దాన్ని సద్వినియోగం చేసుకుని గిరిజనులు ఆర్థిక స్వావలంబన సాధించాలని పుష్పశ్రీవాణి సూచించారు. డిమాండ్ ఉన్న అటవీ ఉత్పత్తులను మార్కెటింగ్ చేసుకోవాలన్నారు.
'గిరిజన యువత, మహిళలు స్వయం ఉపాధి సాధించాలి'
విజయనగరం జిల్లా కురుపాం మండలం దండుసుర గ్రామ గిరిజన మహిళలకు డీసీసీబీ బ్యాంకు ఇచ్చిన రూ. 3.30లక్షల చెక్కును ఉపముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి అందజేశారు. గిరిజన యువత, మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించాలని సూచించారు.
గిరిజన మహిళలకు చెక్కు అందజేస్తున్న ఉపముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి